Site icon NTV Telugu

Uma Harathi IAS: ఐఏఎస్ అధికారిణిగా కుమార్తె..సెల్యూట్ చేసిన ఐపీఎస్‌ తండ్రి

New Project (6)

New Project (6)

ఐపీఎస్ అధికారి కుమార్తె ఐఏఎస్ అయ్యారు. ఆ కుమార్తె పేరు ఉమాహారతి. ఆమె తండ్రి ఎన్. వెంకటేశ్వర్లు ఎస్పీగా పనిచేస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఉమాహారతి అయిదో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ లో మెరిశారు. ఉమా హారతి మూడో ర్యాంక్‌ సాధించి రికార్డు సృష్టించారు. ఈమెది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌. తాజాగా ఐఏఎస్‌ అధికారిణిగా ‘రాజ్‌బహదూర్‌ వేంకట రంగారెడ్డి తెలంగాణ పోలీస్‌ అకాడమీ (RBVRR TGPA)’కి వచ్చింది ఉమాహారతి. అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తండ్రి ఐపీఎస్‌ అధికారి వెంకటేశ్వర్లు కుమార్తెకు సెల్యూట్‌ చేశారు. హైదరాబాద్‌ చిల్కూరు ఏరియాలోగలలో శనివారం మధ్యాహ్నం ఈ అత్యంత అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు ప్రాక్టికల్‌ ట్రెయినింగ్‌ కోసం RBVRR TGPA కు వచ్చారు. వారికి పోలీస్‌ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్‌కు బదులుగా.. జాయింట్‌ డైరెక్టర్‌ డీ మురళీధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ వేంకటేశ్వర్లు స్వాగతం పలికారు. అనంతరం అకాడమీ మరో డిప్యూటీ డైరెక్టర్‌ సీ నర్మద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులకు బ్రీఫ్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

READ MORE: Fridge Water: వామ్మో.. చల్లటి నీటిని తాగడం వల్ల ఇన్ని నష్టాలా..?

కాగా.. ఉమాహారతి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఐదో ప్రయత్నంలో ఉమా హారతి ర్యాంకు సాధించారు. తండ్రి పోలీసు అధికారి అయినప్పటికీ ఐఏఎస్‌ అవ్వడం తన లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఆమె సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌ గురించి ఉమా హారతి మాట్లాడుతూ.. “2017 నుంచి ప్రిపరేషన్‌ సాగించినప్పటికీ నా ఆప్షనల్‌ సబ్జెక్టు విషయంలో కొంత తప్పటడుగు వేయడం వల్ల విజయం సాధించలేకపోయాను. తొలుత జాగ్రఫీ (భూగోళశాస్త్రం)ని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకోవడం వల్ల సరైన స్కోర్‌ చేయలేకపోయాను. దీంతో ఆంత్రొపాలజీని నా ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారె. ఈ సారి తీసుకున్న నిర్ణయం నన్ను గెలిపించింది. అలాగే ప్రశ్నలకు సమాధానం రాసే విధానంలో కూడా మార్పులు చేశాను. మునుపటి అటెంప్ట్‌లలో ఎక్కువ కంటెంట్‌ రాయడానికి ప్రాధాన్యత ఇచ్చాను. ఈ సారి డయాగ్రామ్స్‌ రూపంలో ఆన్సర్లు ఇవ్వడంపై నా దృష్టి కేంద్రీకరించాను.” అని తన గెలుపుని వివరించారు.

Exit mobile version