Malkajgiri: డేటింగ్ యాప్‌లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్‌తో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముంచిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dating App Cyber Fraud: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో డేటింగ్ యాప్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను టార్గెట్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి వలలో చిక్కుకున్న బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. డేటింగ్ యాప్‌లో శిక్ష అనే పేరుతో ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు పరిచయమైంది. కొద్ది రోజుల చాటింగ్ అనంతరం వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించింది. న్యూడ్ వీడియో కాల్ చేసింది. తాను సైతం న్యూడ్ వీడియో కాల్ చేయాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చింది.
ఆ వీడియో కాల్ అనంతరం బాధితుడికి టెలిగ్రామ్ ద్వారా ఒక లింక్ పంపింది. ఆ లింక్‌ను ఓపెన్ చేసిన వెంటనే బాధితుడి మొబైల్‌లోని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం సేకరించింది ఆ కిలేడీ.. తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను కాంటాక్ట్‌లలో ఉన్న వారందరికీ పంపిస్తానని బెదిరింపులకు దిగింది. ఈ విధంగా బాధితుడి నుంచి సుమారు రూ.2.5 లక్షలు వసూలు చేసింది. అయినా మరింత డబ్బు డిమాండ్ చేయడంతో బాధితుడు చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో కాంటాక్ట్ లిస్ట్‌లోని కొందరికి వీడియోలను పంపింది. దీంతో బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు, ఆమె వెనుక ఉన్న ముఠాను గుర్తించే పనిలో పడ్డారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?