Site icon NTV Telugu

Telecom Bill 2022: త్వరలోనే పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు

Telecom Bill

Telecom Bill

Telecom Bill: మరో ఆరు నుంచి పది నెలల్లో పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ప్రజాభిప్రాయం కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. నూతన టెలికాం బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం తొందరపడడం లేదని.. ప్రజాభిప్రాయం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాక తుది డ్రాఫ్ట్‌ను రూపొందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తుది డ్రాఫ్ట్‌ను తొలుత పార్లమెంట్ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్నారు.

Dussehra Rally: షిండే వర్గానికి కోర్టు షాక్.. ఆ పార్క్‌లో దసరా వేడుకలకు ఉద్ధవ్‌కు అనుమతి

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885,ఇండియన్ వైర్ లెస్ టెలీగ్రఫీ యాక్ట్ 1933, టెలిగ్రాఫ్ వైర్స్ (చట్టవిరుద్ధ స్వాధీనం) యాక్ట్ 1950 స్థానంలో నూతన బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అక్టోబరు 20లోపు నూతన టెలికాం బిల్లుపై ప్రజాభిప్రాయం కోరనుంది. ఇంటర్నెట్ ద్వారా ఆడియో, వీడియో కాలింగ్, మెసేజింగ్ సేవలు అందిస్తున్న వాట్సాప్, జూమ్, గూగుల్ డుయో, ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు సైతం ఇకపై దేశీయంగా టెలికాం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులో కేంద్రం పొందుపరిచింది. టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. టెలికామ్ సంస్థలు లైసెన్సులను సరెండర్ చేసిన సందర్భంలో రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదనను నూతన బిల్లులో కేంద్ర సర్కారు చేర్చింది.

Exit mobile version