NTV Telugu Site icon

Pakistan Cricket: పాకిస్థాన్‌కు గంభీర్ లాంటి కోచ్ అవసరం..

Pak

Pak

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ అవసరమని.. అలాంటి వాడైతేనే జట్టులోని ఆన్-ఫీల్డ్, ఆఫ్-ఫీల్డ్ సమస్యలను పరిష్కరించగలడని డానిష్ కనేరియా తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత.. పాకిస్తాన్ టీంకు వైట్-బాల్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను, టెస్ట్ టీమ్ కోచ్‌గా జాసన్ గిల్లెస్పీని నియమించారు. అయితే.. జట్టు ప్రదర్శన ఏ మాత్రం కూడా మారలేదు. అంతేకాకుండా.. అన్నీ సిరీస్ ల్లో పేలవ ప్రదర్శన చూపిస్తున్నారు. తాజాగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో కూడా.. పాకిస్తాన్ సెమీస్ కంటే ముందు ఇంటికొచ్చింది. గ్రూప్ దశలోనే నిష్క్రమించారు.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌‌కు కేంద్రం కూడా షాక్.. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్

తాజాగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, కొందరు దిగ్గజాలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఛానెల్ తో కనేరియా మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ జట్టులో కెప్టెన్లు మారుతూనే ఉంటారు. ఎవరికైనా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే, అతని ప్రదర్శన మంచిగా ఉంటే ఏడాది పాటు జట్టును నడిపించే అవకాశం ఉంటుందని అన్నాడు. అలాగే.. జట్టు కోసం కోచ్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. కానీ.. పాకిస్తాన్ జట్టులో అలా ఉండదని చెప్పాడు.

Plane Hijackings: ఇండియాలో 16 విమాన హైజాక్ సంఘటనలు.. ఉగ్రవాదులు, రామ మందిరం, ఖలిస్తాన్ ఇలా ఎన్నో కారణాలు..

రోజురోజుకీ పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనకు కారణం.. కెప్టెన్లను మార్చడమేనని కనేరియా తెలిపాడు. కెప్టెన్‌తో ఎప్పటికప్పుడు కోచ్ కూడా చర్చించాలని చెప్పాడు. కెప్టెన్సీ బాగా లేకపోతే కోచ్ నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. ఇలాంటివన్నీ కోచ్ చూసుకోవాలని పేర్కొన్నాడు. కానీ.. పాకిస్తాన్ జట్టు విషయంలో అలా లేదని తెలిపాడు. క్రికెట్ లో ఇతర జట్లు ఎందుకు బాగా రాణిస్తున్నాయి.. భారత జట్టు ఎందుకు బాగా రాణిస్తోందో చెప్పాడు. టీమిండియాకు ఇంతకుముందు రాహుల్ ద్రవిడ్ ఉండేది.. అతను కోచ్ గా ఏం చేయాలో అంతకన్న ఎక్కువే చేశాడని చెప్పాడు. ఇప్పుడు అతని స్థానంలో గౌతమ్ గంభీర్ వచ్చాడు. అతను అద్భుతమైన ఆటగాడు.. అతను రియాక్ట్ అయ్యే తీరు అతని ముఖంలోనే కనిపిస్తుందని అన్నాడు. అతను చాటుగా ఒక మాట్లాడడు.. ఏదైనా ఉంటే ముఖంపైనే సూటిగా మాట్లాడుతాడని చెప్పాడు. అలాగే.. పాకిస్తాన్ కోచ్ కూడా ఇలాగే ఉండాలి.. ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పాలని సూచించాడు.

Show comments