NTV Telugu Site icon

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కొత్త కోచ్‌గా కివీస్ లెజెండ్

Srh

Srh

Sunrisers Hyderabad: ఐపీఎల్‌-2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. మొత్తం సీజన్‌లో 14 మ్యాచ్‌లో నాలుగింట మాత్రమే గెలిచింది. ఈ విధంగా ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌హెచ్‌ పేలవ ప్రదర్శనను కనబరుస్తోంది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరకపోవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఐపీఎస్‌-2023 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం కోసం జట్టులో కీలక మార్పులకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది. వచ్చే సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పు చేసింది. హెడ్‌ కోచ్‌గా ఉన్న బ్రయాన్‌ లారాను తొలగించింది.

లారా స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డేనియల్‌ వెట్టోరీని ప్రధాన కోచ్‌గా నియమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. బ్రయాన్‌ లారాతో 2 సంవత్సరాల ఒప్పందం ముగిసిందని ఎస్‌ఆర్‌హెచ్ వెల్లడించింది. డేనియల్ వెట్టోరి గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా ఉన్నాడు. వెట్టోరీ ఆస్ట్రేలియా జట్టు అసిస్టెంట్‌ కోచ్‌గా కూడా వ్యవహరించాడు. ఎస్‌ఆర్‌హెచ్కు వెటోరి నాలుగో హెడ్ కోచ్‌. వెట్టోరి కంటే ముందు టామ్ మూడీ (2013-2019, 2022), ట్రెవర్ బేలిస్ (2020-2021), లారా (2023) హెడ్‌ కోచ్‌లుగా వ్యవహరించారు.

 

Show comments