NTV Telugu Site icon

Amit Shah: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రమాదం

Amit Shah

Amit Shah

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌లో రోడ్‌షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన ప్రచార వాహనానికి విద్యుత్‌ తీగలు తగిలాయి. దీంతో విద్యుత్ తీగ తెగి పడిపోయింది. గమనించిన బీజేపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. అమిత్ షా వాహనం వెనుక ఉన్న అన్ని వాహనాలను అప్రమత్తం చేశారు. వాహనాలు నిలిచిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పింది. హోంమంత్రి అమిత్ షాతో సహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎన్నికల సభలో పాల్గొనేందుకు బిడియాడ్ గ్రామం నుంచి పర్బత్ సర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Read Also:Hyderabad: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ హెచ్చరిక.. ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలపై నిషేదం

మంగళవారం రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ప్రమాదం తప్పినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రోడ్డుకు ఇరువైపులా ఇళ్లు, దుకాణాలు ఉన్న వీధిలో ర్యాలీ నిర్వహించారు. వాహనం సమీపంలో విద్యుత్ తీగలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?