Site icon NTV Telugu

Actor Sivaji: ‘దండోరా’ ఇక్కడితో ఆగే సినిమా కాదు.. మున్ముందు చాలా అవార్డులు వస్తాయి: శివాజీ

Actor Sivaji

Actor Sivaji

Actor Sivaji: తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటుకుంది. మూడు కేటగిరీల్లో ‘దండోరా’ అవార్డుల్ని కొల్లగొట్టేసింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ‘దండోరా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య, అదితి భావ‌రాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం చిత్రయూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించింది.

READ ALSO: Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

ఈ థాంక్యూ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ .. ‘మా ‘దండోరా’ సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ గారు వేసిన ట్వీట్‌తో తెలుగు వారందరికీ ఈ చిత్రం దగ్గరైంది. మార్క్ కె రాబిన్‌ గారికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి థాంక్స్. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంటుంది. మురళీగారు ‘దండోరా’ కథని, మూవీని మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్ కోసం నేను చాలా వరకు రాత్రి పూట రెండు, మూడు గంటలే నిద్రపోయేవాడ్ని. నటన అంటే దైవంతో సమానం. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా నేను చేసే వాడ్ని కాదు. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నాను’ అని అన్నారు. దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. ‘మా ‘దండోరా’ సినిమాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, ప్రభుత్వానికి థాంక్స్. ఇలాంటి అవార్డులు, గుర్తింపు వచ్చిన సమయాల్లోనే మన వద్ద ఉన్న టాలెంట్ గురించి అందరికీ తెలుస్తుంది. శివాజీ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయికి వచ్చింది’ అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది

READ ALSO: Pawan Kalyan: బాబాయ్ చెప్పే ఆ హారర్ స్టోరీసే వేరు.. పవన్ కళ్యాణ్ గురించి సుస్మిత ఇంట్రెస్టింగ్ రివీల్స్!

Exit mobile version