సికింద్రాబద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో వెయిటింగ్ లిస్ట్ 400ను దాటింది. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయిటింగ్ చూపుతున్నా.. ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపడం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేల మంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి.
Also Read : Twitter Blue Tick: మస్క్ కీలక నిర్ణయం.. వారికి ఫ్రీగా ట్విట్టర్ బ్లూటిక్.. వీరికి మాత్రం షాక్..!
పుష్కరాలు జరిగే తేదీలతో పాటు వాటికి అటూ ఇటూగా దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా.. సాధారణ రోజల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరేట్లు పెరుగుతున్నా.. అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు నజర్ పెట్టలేకపోతున్నారు. సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ. 5 నుంచి రూ. 8 వేల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి అమ్ముతున్నారు. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటుంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్ ఎక్స్ ప్రెస్ వైపే చూస్తున్నారు.
Also Read : Bhatti Vikramarka : సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ రైళ్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో పని చేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైల్ మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్నమాట ముందు రైలుకు ఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడుస్తుంది.
Also Read : Janhvi: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనవడితో తిరుపతిలో కనిపించిన జాన్వీ…
అయితే కోవిడ్ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్దరించలేదు. అది రద్దీ మార్గం కావడం.. దానికి తగ్గ అదనపు లైన్లు లేకపోవడం.. ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగదించుకుంటుండటమే దీనికి ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దైన క్లోన రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతో పాటు తెలంగాణ సర్కార్ కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చి ఆ క్లోన్ రైలును పునరుద్దరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
