Site icon NTV Telugu

Danam Nagender: “అంతా సీఎం చేతిలోనే”.. రాజీనామాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..

Mla Danam Nagender

Mla Danam Nagender

Dana Nagender: రాజీనామాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా అంశాన్ని సీఎం నిర్ణయంతో ముడిపెట్టాడు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయమని వెనకాడనన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుతుందని గుర్తు చేశారు. “సుప్రీంకోర్టులో అప్పీల్ చేశా.. కేసు కోర్టులో పెండింగ్ ఉంది.. స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉంది.. సుప్రీంకోర్టులో నా వైపు నుంచి వాదనలు వినిపిస్తా.. సందర్భాన్ని బట్టి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా.. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటా.. ఎన్నికలు ఎదుర్కోవడం నాకు కొత్తేం కాదు.. ఎన్నో ఎన్నికలు చూశా.. 11 సార్లు కొడ్లాడిన చరిత్ర నాది. రేవంత్‌ రెడ్డి మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.” అని వ్యాఖ్యానించారు.

Exit mobile version