NTV Telugu Site icon

Damodara Raja Narsimha : మెడికల్ UG, PG అడ్మిషన్ ల భర్తీపై టాస్క్ ఫోర్స్ కమిటీ

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష లో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడంతోపాటు మెడికల్ UG, PG అడ్మిషన్ ల భర్తీపై టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్య ను అందించడమే లక్ష్యంగా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలో బోధన సిబ్బంది నియామకాలు, కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన ను పర్యవేక్షించడం తోపాటు యూజీ, పీజీ అడ్మిషన్ల భర్తీ పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

 

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలో బోధన సిబ్బంది హాజరుపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య ను పటిష్ట పరిచేందుకు , వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ కమిటీ చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెంబర్ కన్వీనర్ గా నియమించారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ( అకాడమిక్), కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సెస్ రిజిస్టర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ , గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లు సభ్యులుగా నియమిస్తూ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ డా. క్రిస్టినా జడ్ చొంగ్తు, ప్రభుత్వ ఉప కార్యదర్శి వినయ్ కృష్ణారెడ్డి, డా . వాణి – డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, టీజీ ఎంఎస్ఐటిసి ఎండి హేమంత్ వాసుదేవరావు, ఉస్మానియా గాంధీ మెడికల్ కాలేజీ ల ప్రిన్సిపాల్స్ లు పాల్గొన్నారు.