Site icon NTV Telugu

Damodara Raja Narasimha : రాష్ట్రంలో కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌..

Damodara Raja Narsimha

Damodara Raja Narsimha

Damodara Raja Narasimha : డ్రగ్ కంట్రోల్ అథారిటీ, TGMSIDC అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. నాసిరకం నకిలీ మందులు తయారీ చేసేవారిపై అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్‌ అథారిటీని ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి.. ఫార్మా సంస్థలు ఉన్నచోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించాలని ఆయన సూచించారు. పెరిగిన మెడికల్ షాప్స్ కి అనుగుణంగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెంచాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం 71 మంది డ్రాగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు కనీసం 150 మంది అవసరమని మంత్రికి డీసీఏ అధికారులు తెలిపారు.. దీంతో.. ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన మేరకు పోస్టులు మంజూరు చేస్తామని మంత్రి దామోదర హామీ ఇచ్చారు.

Joe Biden: ఇసుక బీచ్‌లో బైడెన్ పలుమార్లు తడబాటు.. వీడియో వైరల్

మత్తుని కలిగించే మందులను విచ్చలవిడిగా అమ్ముతున్న వారిపై నిఘా పెట్టాలని, ప్రభుత్వ దవాఖానాలలో పంపిణీ చేసే మెడిసిన్ కొనుగోలు విషయంలో TGMSIDC కి DCA సహకారం అందించాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలోకి వచ్చి పేషెంట్లకు నాణ్యమైన మెడిసిన్ అందించేలా చర్యలు ఉండాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌.. ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ చేపడుతామన్నారు. కలెక్టరేట్లలో కంప్లైంట్ సెల్స్‌, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ టీమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మెడిసిన్ ఎక్కువ ధరకు అమ్ముతున్న హాస్పిటల్స్‌, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలన్నారు.

GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?

Exit mobile version