NTV Telugu Site icon

Damodara Raja Narasimha : బీఆర్‌ఎస్‌కు మంత్రి దామోదర కౌంటర్‌

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ చేస్తున్న ఆరోపణలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘గత ప్రభుత్వంలో జరిగిన దుర్ఘటనలు. 2017 లో కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో 3 రోజుల్లో 6గురు బాలింతలు చనిపోయారు. 2017లో 5రోజుల వ్యవధిలో నీలోఫర్ హాస్పిటల్ లో 5గురు బాలింతలు చనిపోయారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం DPL పద్ధతిలో చేసిన ఆపరేషన్ లతో 4గురు మహిళలు చనిపోయారు. దీనితో వారి పిల్లలు అనాధలయ్యారు. మీరు ఇచ్చిన హామీ పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగం, ఇల్లు అటకెక్కినవి. 2019లోని జూన్, జూలై డెంగ్యూ మరణాల సంఖ్య 100 మంది. మెటర్నటీ డెత్స్, పీడియాట్రిక్ డెత్స్ నెలవారి సగటున మరణాలు తగ్గాయి. కమిటీల పేరుతో కాలయాపన చేశారు తప్ప…శాశ్వత పరిష్కారం గత ప్రభుత్వం చూపించలేకపోయింది. మీ నిర్వాకం వల్ల వైద్యం పేదలకు అందని ద్రాక్ష గా మిగిలింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుచందంగా వ్యవస్థ మారింది. ఇవన్నీ నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాలి. మీరు మాట్లాడే అబద్ధాలకు ఇవే సాక్ష్యం. గత 10 సంవత్సరాల పాలనలో మీరు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నాం.’ అని స్పందించారు.

Breaking News: పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?