NTV Telugu Site icon

Uttarpradesh: 14 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరు అరెస్ట్

Uttarpradesh

Uttarpradesh

Uttarpradesh: దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో కేసు వెలుగుచూసింది. మథుర జిల్లాలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం తర్వాత గొంతు నులిమి హత్య చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన ఇంటికి సమీపంలోని అటవీ ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది. ఆమె తన తొమ్మిదేళ్ల సోదరిని తన వెంట తీసుకువెళ్లింది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను అక్కడ పట్టుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేశారని వారు తెలిపారు. ఆమె చెల్లెలు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అది విన్న వెంటనే కుటుంబ సభ్యులతో పాటు ఇతర గ్రామస్థులు బాలిక కోసం వెతకడం ప్రారంభించి ఇద్దరు పురుషులను పట్టుకున్నారు.

EGG : సామాన్యులకు షాకిస్తున్న గుడ్డు.. రేటు భలే ఘాటు..

ఘటనా స్థలాన్ని సందర్శించిన రూరల్ పోలీసు సూపరింటెండెంట్ త్రిగుణ్ బిసెన్ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను శాంతింపజేశారు. గ్రామస్తులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు దేశరాజ్, యోగేంద్రలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు సచిన్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ప్రాథమికంగా చూస్తే బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అలోక్ సింగ్ తెలిపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.