Deler Mehndi: మానవ అక్రమ రవాణా కేసులో పంజాబ్ గాయకుడికి రెండేళ్లు జైలుశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ అక్రమ రవాణా కేసులో పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి పాటియాలా అదనపు సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. ఇవాళ అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు కాగా.. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడే వదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే వదలిపెట్టేవారు.
1998 నుంచి 1999 వరకు దాదాపు 15 మందిని చట్ట విరుద్ధంగా అమెరికా, కెనడా దేశాలకు తీసుకెళ్లి విడిచిపెట్టినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్ విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. సంగీత బృందంతోపాటుగా కొందరిని చట్ట విరుద్దంగా అమెరికా తీసుకెళ్లినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. భారతీయ పాస్‌పోర్ట్ చట్టంతో పాటు మానవ అక్రమ రవాణా, కుట్రకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. ఇందు కోసం దలేర్, షంషేర్‌లు భారీగా డబ్బులు తీసుకునేవారని తెలిపారు. అలాగే కొందరిని విదేశాలకు తీసుకెళ్తామని చెప్పి మోసం చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దలేర్, షంషేర్‌లు తమను మోసం చేశారని 35 మంది కేసులు పెట్టారు.
Also Read
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్
దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో వదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు.. సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయనకు కోర్టు శిక్ష వేసింది. గతంలో మూడేళ్ల తర్వాత దలేర్ మెహందీ నిర్దోషి అంటూ తీర్పు రాగా.. స్థానిక పోలీసులు స్థానిక కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేశారు. అయితే తదుపరి విచారణ కోసం “తగిన సాక్ష్యం” ఉందని పేర్కొంటూ అతనిని విడుదల చేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను ఖరారు చేయడానికి మరో 12 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు అప్పీల్‌పై నిర్ణయం తీసుకోవడానికి మరో నాలుగు సంవత్సరాలు పట్టింది.
తాజావార్తలు
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!