NTV Telugu Site icon

Deler Mehndi: మానవ అక్రమ రవాణా కేసులో పంజాబ్ గాయకుడికి రెండేళ్లు జైలుశిక్ష

Daler Mehndi

Daler Mehndi

మానవ అక్రమ రవాణా కేసులో పంజాబీ గాయకుడు దలేర్‌ మెహందీకి పాటియాలా అదనపు సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. పంజాబీ గాయకుడు దలేర్ మెహందీని పాటియాలా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అక్రమంగా వ్యక్తుల తరలింపు కేసులో ట్రయల్ కోర్టు 2 సంవత్సరాల శిక్ష విధించింది. ఆ తర్వాత దలేర్ మెహందీకి బెయిల్ వచ్చింది. ఈ నిర్ణయాన్ని దలేర్ మెహందీ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. ఇవాళ అదనపు సెషన్స్ జడ్జి దలేర్ మెహందీ అప్పీల్‌ను తిరస్కరించారు. 2003లో దలేర్ మెహందీపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు కాగా.. ప్రొబేషన్‌పై విడుదల చేయాలని ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. విదేశాల్లో పాటలు పాడేందుకు వెళ్లినపుడు తన వెంట కొంత మంది వ్యక్తులను తాత్కాలిక వీసాలపై ఆయా దేశాలకు తీసుకెళ్లి అక్కడే వదిలేసేవారు. ఇలా ఈయన పాటల ప్రోగ్రాం జరిగిన దేశాల్లోకి అక్రమంగా వ్యక్తులకు తీసుకెళ్లి అక్కడే వదలిపెట్టేవారు.

1998 నుంచి 1999 వరకు దాదాపు 15 మందిని చట్ట విరుద్ధంగా అమెరికా, కెనడా దేశాలకు తీసుకెళ్లి విడిచిపెట్టినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్ విదేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. సంగీత బృందంతోపాటుగా కొందరిని చట్ట విరుద్దంగా అమెరికా తీసుకెళ్లినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. భారతీయ పాస్‌పోర్ట్ చట్టంతో పాటు మానవ అక్రమ రవాణా, కుట్రకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు. ఇందు కోసం దలేర్, షంషేర్‌లు భారీగా డబ్బులు తీసుకునేవారని తెలిపారు. అలాగే కొందరిని విదేశాలకు తీసుకెళ్తామని చెప్పి మోసం చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దలేర్, షంషేర్‌లు తమను మోసం చేశారని 35 మంది కేసులు పెట్టారు.

Amarnath Yatra: కశ్మీర్ లోయలో భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్

దలేర్ మెహందీతో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ ప్రమేయం కూడా ఉందని తేలింది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడాలనుకునే వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. విదేశాల్లో వదిలి పెట్టి రావడానికి కొంత డబ్బును దలేర్ మెహందీ తన సోదరుడితో కలిసి తీసుకున్నట్లుగా పోలీసులు అభియోగం మోపడంతో పాటు.. సాక్ష్యాలతో సహా ఋజువు చేశారు. దీంతో ఆయనకు కోర్టు శిక్ష వేసింది. గతంలో మూడేళ్ల తర్వాత దలేర్ మెహందీ నిర్దోషి అంటూ తీర్పు రాగా.. స్థానిక పోలీసులు స్థానిక కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు వేశారు. అయితే తదుపరి విచారణ కోసం “తగిన సాక్ష్యం” ఉందని పేర్కొంటూ అతనిని విడుదల చేసేందుకు కోర్టు నిరాకరించింది. శిక్షను ఖరారు చేయడానికి మరో 12 సంవత్సరాలు పట్టింది, ఇప్పుడు అప్పీల్‌పై నిర్ణయం తీసుకోవడానికి మరో నాలుగు సంవత్సరాలు పట్టింది.