Site icon NTV Telugu

LEO : దళపతి విజయ్‌ ‘లియో’ మూవీ అఫీషియల్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Whatsapp Image 2023 11 20 At 2.13.40 Pm

Whatsapp Image 2023 11 20 At 2.13.40 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 19 న విడుదలయింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్‌ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. లియో సినిమాలో విజయ్‌ సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌, యాక్షన్ కింగ్ అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లియో ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విజయ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్ గురించి రీసెంట్ గా పలు వార్తలు వచ్చాయి.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ నవంబర్‌ 17న వస్తుందని, లేదు ఈ సినిమా నవంబర్‌ 21న స్ట్రీమింగ్‌ అవుతుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్‌ పెడుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ లియో మూవీ స్ట్రీమింగ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా రెండు తేదీలను ప్రకటించింది. భారత్‌లో నవంబర్‌ 24 నుంచి లియో స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్‌ 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ ఫ్లిక్స్‌ ప్రకటించింది.భారత్‌లో నవంబర్‌ 24న తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో లియో స్ట్రీమింగ్‌ కానుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ మరియు జగదీష్‌ పళని స్వామి భారీ బడ్జెట్‌తో లియో ను నిర్మించారు. మిస్కిన్‌, మడోన్నా సెబాస్టియన్‌, జార్జ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, ప్రియా ఆనంద్‌, మాథ్యూ థామస్‌, బాబూ ఆంటోని మరియు లీలా శామ్సన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్‌ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.

https://twitter.com/Netflix_INSouth/status/1726457843652464968?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726457843652464968%7Ctwgr%5Ef9ff958a3afd19cd5ca290e1eae1ddae9aebff2e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

Exit mobile version