DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఎదురుచూస్తున్న కరవు భత్యం (DA) పెంపుపై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించనున్నారు. ఒకవేళ ఈ పెంపునకు ఆమోదం లభిస్తే.. సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ సవరించిన డీఏ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది.
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ AI కెమెరా, IP69 రేటింగ్‌తో Realme 15x 5G లాంచ్.. ధర ఎంతంటే?
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కరవు భత్యాన్ని చెల్లిస్తుంది. ఏటా రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో ఈ డీఏ సవరణలు ఉంటాయి. వినియోగదారుల ధరల సూచీ (CPI) గణాంకాల ఆధారంగా ఈ పెంపును లెక్కిస్తారు. గతంలో అంటే ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం డీఏను 2% పెంచింది. దీంతో అది ప్రాథమిక వేతనం, పింఛనులో 53% నుంచి 55%కి చేరింది.
Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
ఉదాహరణకు, రూ. 50,000 ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం డీఏ కింద రూ. 26,500 లభిస్తోంది. తాజా పెంపు అమలైతే ఈ మొత్తం మరింత పెరగనుంది. దీనివల్ల పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. ఈ డీఏ పెంపునకు నేడు ఆమోదం లభిస్తే, పండుగ సీజన్‌కు ముందు ఉద్యోగులు, పింఛనర్ల చేతికి అదనపు డబ్బు అందనుంది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక వ్యవస్థకు కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
