NTV Telugu Site icon

Nikhil Gupta: అమెరికాకు నిఖిల్ గుప్తాను అప్పగించేందుకు కోర్టు అనుమతి..

Nikhil

Nikhil

Czech High Court: నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారత్ కు చెందిన నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే, నిఖిల్ గుప్తా అప్పగింతపై తుది నిర్ణయం ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖకే కోర్టు వదిలేసింది.

Read Also: AI Girl Friend : గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీలవుతున్నారా.. అలా వెళ్లి మార్కెట్లో ఏఐ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకోండి

ఇక, అమెరికాలో గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర జరిగింది.. ఈ కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని అమెరికా అటార్నీ కార్యాలయం సంచలన ఆరోపణలు చేసింది. ఈ కుట్రలో నిందితుడికి భారత అధికారి నుంచి ఆదేశాలు వచ్చాయని అమెరికా ఆరోపణలు చేసింది. అయితే, అమెరికా ఆరోపణలపై భారత్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.. దీనిపై తాము ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని భారత ప్రభుత్వం ప్రకటించింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించడం సరికాదని భారత్ క్లారిటీ ఇచ్చింది.

Read Also: Salaar 2: ఊహించిన దానికన్నా ముందుకొచ్చిన ‘శౌర్యాంగ పర్వం’?

అయితే, గత జూన్‌ నెలలో నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుప్తా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, అతడిని తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్ పై అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్ కోర్టు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.