IPL Final: ఐపీఎల్(IPL 2024) ఫైనల్ మ్యాచ్ ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)తో రాత్రి 7.30గంటలకి తలపడబోతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మరి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఒకవేళ మ్యాచ్ లో వాన పడితే అదనంగా 120 నిమిషాల సమయం ఇస్తారు. అయినా వర్షం తగ్గకపోతే తర్వాత రోజు (రిజర్వ్ డే) మ్యాచ్ జరుగుతుంది. అయితే, రెండు రోజులూ వర్షం పడితే పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ విజేతగా ప్రకటిస్తారు. కాగా, చిదంబరం స్టేడియంలో పిచ్ బౌలింగ్‌కి అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో 84 ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగ్గా.. అందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 49 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: Tension in Karimnagar: హనుమాన్ భక్తుల ర్యాలీలో కొనసాగిన ఉద్రిక్తత.. ఆరుగురిపై కేసు నమోదు..
వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం..
భారత వాతావరణ విభాగం (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొనింది. అలాగే, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలి వీస్తుందని చెప్పారు. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది.. ఇక, ఇవాళ చెన్నైలో మేఘాలు కమ్మేస్తాయని ఐఎండీ తెలిపింది. రాత్రి 12 తర్వాత మాత్రమే మేఘాలు పోతాయని చెప్పుకొచ్చింది. ఇక, ఈరోజు ఏ సమయంలోనైనా చెన్నైలో వాన పడే అవకాశం లేదు అనే న్యూస్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Also: Remal Cyclone : ‘రెమల్’ తుఫాన్ ఎఫెక్ట్.. బెంగాల్, ఒడిశా అలర్ట్
అయితే, చెన్నైలో ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో గంటకు 11 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. చెన్నై చుట్టుపక్కల గాలి వేగం తక్కువగానే ఉండంతో వర్షం వచ్చే అవకాశం లేనట్లే అని తెలిపింది. కాగా, నేడు చెన్నైలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.. మ్యాచ్ జరిగే సమయంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వెల్లడించింది. తేమ రాత్రి 7.30కి 58 శాతంగా.. రాత్రి 8.30కి 66 శాతంగా, రాత్రి 9.30కి 72 శాతంగా, రాత్రి 10.30కి 76 శాతంగా, రాత్రి 11.30కి 78 శాతంగా ఉండనుందని ప్రకటించింది. ఇప్పటివరకూ వచ్చిన సమాచారం ప్రకారం.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ వాన కురిసే అవకాశం లేదని.. సాయంత్రానికి వాతావరణంలో అనూహ్య మార్పులేమైనా వస్తే.. వర్షం పడే అవకాశం ఉండొచ్చు అని భారత వాతవరణ శాఖ వెల్లడించింది.