Site icon NTV Telugu

Rain Alert In AP: ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Ditwa

Ditwa

Rain Alert In AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

Read Also: Pocharam Infocity: ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కట్‌చేస్తే..

ఇక, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే, ఇక, డిసెంబర్ 1న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

Exit mobile version