Site icon NTV Telugu

Miss World 2025: మిస్ వరల్డ్ ఈవెంట్.. నగరంలో భారీ బందోబస్తు..!

Miss World 2025

Miss World 2025

Miss World 2025: ఈనెల 10 నుండి 31 వరకు మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10 నుండి 31 వరకు ఈవెంట్ కొనసాగుతుందని, మెయిన్ ఈవెంట్ ఈనెల 10, 31 వరకు ఉండబోతుందని తెలిపారు. అలాగే వివిధ దేశాల నుండి వచ్చే అతిధులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే 80% పైగా అతిథులు, పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని అధికారులు తెలిపారు. వారికి కేటాయించిన హోటల్స్ వద్ద కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం బడా నిర్మాణ సంస్థల పోటీ..

ఇక అతిథులు స్టే చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్ గా ఉంచామని, అనుమతి లేకుండా ఎవరికి లోపలకు అనుమతి ఉండదని తెలిపారు. తెలంగాణలో చాలా ప్రదేశాలను అతిధులు విజిట్ చేస్తారని, మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం ఎలాంటి ట్రాఫిక్ డైవర్షన్ లు ఉండవని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. సీఎం, గవర్నర్, మినిస్టర్స్, వీవీఐపీ, వీఐపీలకు ప్రోటోకాల్ ఉంటుందని.. ఇతర జిల్లాల నుండి కూడా ఫోర్స్ ను తెప్పించామని తెలిపారు. 31న మిస్ వరల్డ్ ఫైనల్ ఉండబోతుందని.. దానికి అనుగుణంగా భద్రత పరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version