NTV Telugu Site icon

Stephen Raveendra : బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

Stephen Raveendra

Stephen Raveendra

Cyberabad Police Arrested Bike Offenders.
సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను పోలీసుల అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 లక్షల విలువైన 46 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. శంషాబాద్ SOT, శంషాబాద్ జోన్ పోలీసులు కలిసి బైక్ అఫెండర్స్ ను పట్టుకున్నారని తెలిపారు. ఆరుగురు సభ్యులు గల ముఠా అని.. 10 నెలల నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లో బైక్ ల దొంగతనాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 44 కేసులు డిటెక్ట్ అయినవి.. ఈ ముఠా లో ఇద్దరు జువైనల్స్ ఉన్నారు. ప్రధాన నిందితుడు A 1 మహమ్మద్ అష్వాక్ అలియాస్ ఖబీర్ పాతబస్తీ కీ చెందిన వ్యక్తి.. మదీన సెంటర్ లో సెల్స్ మేన్ గా పనిచేసేవాడు…

 

సద్దాం అనే స్నేహితునితో కలిసి ఫస్ట్ హైదరాబాద్ లో బైకులు దొంగతనం చేశారు.. మరో నలుగురు ని కలుపుకుని మూడు కమీషనరేట్ ల పరిదిలో వరుసగా టూ వీలర్ లు చోరీ చేసేవారు. ఇద్దరు జువైనల్స్ ను కూడా గ్యాంగ్ లో చేర్చుకున్నారు.. జీతం సరిపోక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేశారు… వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి లలో అమ్మేవారు. ఫైనాన్స్ కట్ఠని బైకులు అని చెప్పి అమ్మేవారు. 15 వేల నుంచి 30 వేల వరకు బైకులను అమ్మేవారు.. షాపింగ్ మాల్స్ లో, షాపుల ముందు లాక్ చేయకుండా ఉన్న బైకులు వీరి టార్గెట్‌ అని స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు వెల్లడించారు.