NTV Telugu Site icon

Cyber Fraud : వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్‌లు

Collector Pravinya

Collector Pravinya

వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్రావీణ్య పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్‌ నుంచి ఆ సందేశం పంపిన సబైర్‌ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ ప్రావీణ్య త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రూ డ‌బ్బులు అడిగిన ఇవ్వొద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వకండి. , వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ ప్రావీణ్య ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు.