Site icon NTV Telugu

Raghuveera Reddy: ఆగిపోయిన పనులన్నీ పూర్తిచేస్తా.. మా పార్టీ అభ్యర్థిని గెలిపించండి..

Raghuveera Reddy

Raghuveera Reddy

Raghuveera Reddy: శ్రీ సత్యసాయి మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిస్తే గతంలో ఆగి పోయిన పనులన్నీ పూర్తిచేస్తాను అని ప్రకటించారు సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి.. గత ప్రభుత్వాలు పది సంవత్సరాలలో చేయని పనులు ఐదు సంవత్సరాలలో చేసి చూపిస్తాం అన్నారు. 151 సీట్లు వచ్చిన ప్రభుత్వం చేయలేని పనులను ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతో సాధిస్తాం అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పనులని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల అసమర్థతతో ఆగిపోయాయి.. వాటిని పూర్తి చేసి చూపిస్తాం అన్నారు. మడకశిర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పుంజుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తూ వస్తుంది కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.

Read Also: Marriage: పెళ్లి వేడుకలో ఊడిపోయిన విగ్గు.. బయటపడిన బండారం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

మరోవైపు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి.. ఇక, లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తాం అంటున్నారు కాంగ్రెస్ నేతలు.. ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా కూడా కల్పిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నామాట.

Exit mobile version