CV Anand: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. అక్టోబర్ 9, 10 తేదీలలో ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ‘ఎలైట్ క్రికెట్ లీగ్’ ద్వారా సేకరించిన నిధులను అమరవీరుల కుటుంబాలకు అందజేయనున్నారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ చారిటీ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో రాజకీయ, సినిమా, టీవీ, పోలీస్, వ్యాపార రంగాల ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. దీనికి సంబంధించిన జెర్సీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. టాలీవుడ్ తరపున హీరోలు తరుణ్, సుధీర్ బాబు జెర్సీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలను చూసైనా హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ జిల్లాల్లో ఎంతోమంది ప్రతిభ గల క్రికెటర్లు ఉన్నప్పటికీ, హెచ్‌సీఏ లీగ్‌లను నిర్వహించడం లేదని ఆయన ఆరోపించారు.
పోటీలో పాల్గొనే జట్లు:
- పొలిటికల్ టీం: ఖద్దర్ అన్నాస్
- సినిమా టీం: టాలీవుడ్ క్రికెట్ టీం
- టీవీ టీం: టీవీ రైడర్స్
- పోలీస్ టీం: ఖాకీ బుల్లెట్స్
- బిజినెస్ టీమ్స్: కార్పొరేట్ మిస్సైల్స్, హైదరాబాద్ నవాబ్స్
UP: పదే పదే కరిచే వీధి కుక్కలకు “జీవిత ఖైదు”..యూపీ సర్కార్ నిర్ణయం..
