Cuttack Violence: కటక్‌లోని దర్గా బజార్ ప్రాంతంలో ఆదివారం పోలీసులు, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో డీసీపీ, దర్గా బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఐఐసీ) సహా ఆరుగురు పోలీసు అధికారులు, కొంతమంది మీడియా సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా తలెత్తిన అశాంతి నేపథ్యంలో ఊరేగింపులను ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా నిరసనలు చోటుచేసుకున్నాయి.
READ ALSO: BSNL: నెట్‌వర్క్ లేకుండానే కాల్స్.. VoWiFi సర్వీస్ ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
ఈ సంఘటన తర్వాత కటక్ పోలీస్ కమిషనరేట్ దుండగులను గుర్తించి అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషనర్ ఎస్.దేవ్ దత్తా సింగ్ మాట్లాడుతూ.. దుండగులను గుర్తించడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరసనకారులను గుర్తించి వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిందితులపై కఠినంగా, సత్వర చర్యలు తీసుకోవాలని బృందాలను ఆదేశించారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కటక్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే తప్పుడు, రెచ్చగొట్టే సందేశాల వ్యాప్తిని ఆపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు ఒక ప్రకటనలో తెలిపారు.
READ ALSO: Nobel Prize History: రేపటి నుంచే నోబెల్ బహుమతుల ప్రదానం.. మొదటి సారి ఎప్పుడు ఇచ్చారో తెలుసా!
