Site icon NTV Telugu

Tiger Cubs: నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లల కలకలం

Tiger Cubs

Tiger Cubs

నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లల కలకలం | Ntv

పులిపిల్లలు చూడగానే ముచ్చటగా ఉంటాయి. పులిపిల్లలను చూడడం చాలా అరుదు. ఎందుకంటే పులి పిల్లల్ని పెట్టిన తర్వాత వాటిని వేరేచోటికి తరలిస్తుంది. అసలే పులి.. ఆపై పులి పిల్లల్ని దగ్గరగా చూడడం అరుదు. అలాంటి ముద్దుముద్దుగా ఉండే పులిపిల్లలు అందంగా కనిపిస్తాయి. అయితే, కుక్కల బెడద ఎక్కువ కావడంతో అవి పులిపిల్లలకు హాని చేస్తాయని భావించారు స్థానికులు. వాటిని సంరక్షించారు.

నంద్యాల జిల్లాలో ముద్దొచ్చే పులిపిల్లలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లలు సందడి చేశాయి. ఎక్కడినుంచి వచ్చాయో తెలీదు. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించారు గ్రామస్థులు. ఆ పులిపిల్లలపై కుక్కలు దాడి చేసి గాయ పరచకుండా.. గదిలో భద్రపరిచి..అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు.

Read Also:Harish Rao : తెలంగాణా తరహా రైతు పథకాలపై ఇతర రాష్ట్రాల ఆసక్తి

Exit mobile version