ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది. డెలివరీ బాయ్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనేక మందికి ఈ విజ్ఞప్తి కాస్త వింతగా అనిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్లు, వృద్ధుల పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. ఆకలేస్తేనే ఆర్డర్ పెడతాం కదా అని మరికొందరు ప్రశ్నించారు. మధ్యాహ్నం వేళల్లో ఫుడ్ డెలివరీలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని మరికొందరు సూచించారు. మరోవైపు ఢిల్లీలో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. నేడు ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
READ MORE: Krishna District: పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
కాగా.. ఇటీవల ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో (Zomato) లేటెస్ట్ గా తన యాప్ లో రెండు అప్ డేట్స్ ను చేసింది. కేవలం శాఖాహారం మాత్రమే తినేవారి కోసం ప్రత్యేకంగా ‘ప్యూర్ వెజ్ మోడ్’ ను ప్రారంభించింది. ఇందులో కేవలం ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ వివరాలు మాత్రమే ఉంటాయి. అలాగే, ఈ ఆర్డర్స్ ను డెలివరీ చేయడం కోసం, నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను డెలివరీ చేసే స్టాఫ్ ను ఉపయోగించబోరు. ఈ ప్యూర్ వెజ్ ఫుడ్ ఆర్డర్స్ ను డెలివరీ చేయడం కోసం ప్రత్యేకంగా జొమాటో వెజ్ టీమ్ ను ఏర్పాటు చేశారు.