NTV Telugu Site icon

CSK vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్కే.. స్టార్ బౌలర్లు ఎంట్రీ

Csk Vs Rcb

Csk Vs Rcb

ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు ఉండనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఇరు జట్లలో ఒక్కో మార్పు చేసింది. నాథన్ ఎల్లిస్ స్థానంలో మతిషా పతిరానా జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ చేరాడు. దీంతో.. రసిక్ సలాం బెంచ్ పై కూర్చోనున్నాడు. కాగా.. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో గెలిచి రెండో విజయం కోసం చూస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో బెంగళూరు కోల్‌కతాను ఓడించగా.. చెన్నై తన తొలి మ్యాచ్‌లో ముంబైను ఓడించింది.

Read Also: Char Dham Yatra 2025: కేదార్‌నాథ్ సహా చార్‌ధామ్‌లో రీల్స్, యూట్యూబ్ వీడియోలపై బ్యాన్..

ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాళ్.

సీఎస్కే ప్లేయింగ్ ఎలెవన్:
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దీపక్ హుడా, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మథీషా పతిరానా, ఖలీల్ అహ్మద్.