Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Csk Vs Rr Ipl 2026 Chennai Batting Collapse Jamie Overton Score

CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

Published Date :March 30, 2026 , 9:33 pm
By Burugadda Veerababu
CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన  గైక్వాడ్ సేన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా నేడు గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) , చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చెన్నై జట్టు నిర్ణీత 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది.

టాప్ ఆర్డర్ దారుణ వైఫల్యం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే చుక్కెదురైంది. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను రాజస్థాన్ పేసర్లు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ తన నిప్పులు చెరిగే వేగంతో చెన్నై ఓపెనర్లను బెంబేలెత్తించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), సంజు శామ్సన్ (6), ఆయుష్ మాత్రే (0), మాథ్యూ షార్ట్ (2) వంటి కీలక ఆటగాళ్లు పవర్‌ప్లేలోనే పెవిలియన్ చేరడంతో చెన్నై కోలుకోలేని దెబ్బతింది.

నిరాశ పరిచిన మిడిల్ ఆర్డర్..

ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (17) కాసేపు పోరాడినా.. మాజీ సీఎస్‌కే ప్లేయర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్టార్ ఆల్ రౌండర్ శివం దూబే (6) ఒక భారీ సిక్సర్‌తో ఆశలు రేకెత్తించినా, ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న రాజస్థాన్ బౌలర్ బ్రిజేష్ శర్మ, క్రీజులో కుదురుకుంటున్న కార్తీక్ శర్మ (18)ను అవుట్ చేసి తన మొదటి వికెట్ ఖాతాను తెరిచాడు. నూర్ అహ్మద్ (1), మ్యాట్ హెన్రీ (5) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో చెన్నై 100 పరుగులైనా దాటుతుందా అన్న సందేహం కలిగింది.

ఆదుకున్న జేమీ ఓవర్టన్

జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జేమీ ఓవర్టన్ (43 పరుగులు) ఆపద్బాంధవుడిలా నిలిచాడు. చివరి వికెట్‌కు అన్షుల్ కాంబోజ్‌తో కలిసి 32 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవర్టన్ తన పోరాట పటిమతో కొన్ని ఫోర్లు, సిక్సర్లు బాదడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

బౌలర్ల పంజా..

రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లతో చెన్నై నడుం విరిచారు. వీరికి తోడుగా సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌ను ప్రదర్శించారు. రాజస్థాన్ రాయల్స్ ముందు ఇప్పుడు 128 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో, చెన్నై బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chennai Super Kings vs Rajasthan Royals
  • CSK batting collapse
  • CSK vs RR Highlights
  • IPL 2026
  • IPL Match Score Today

తాజావార్తలు

  • CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

  • ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..

  • MG Motor Price Hike: ఏప్రిల్ 1 నుంచి ఎంజీ కార్లు మరింత ప్రియం.. ధర ఎంత పెరగనుందంటే?

  • Kiran Abbavaram: ఒక్క పాట కోసం కోటి ఖర్చు

  • LPG: గుడ్‌న్యూస్‌.. భారత్‌కు 94 వేల టన్నుల గ్యాస్‌..

ట్రెండింగ్‌

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • Mobiles Stolen: ఐపీఎల్ మ్యాచ్‌ లో వందలాది మంది మొబైల్స్ చోరీ.. పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions