Site icon NTV Telugu

Shivam Dube : శివమ్ దూబే దెబ్బకి.. పరుగులు పెట్టిన చీర్ గర్ల్స్

Shivam Dube

Shivam Dube

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిసన్ 16లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. అయితే కేకేఆర్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ సమయంలో శివమ్‌ దూబే కొట్టిన సిక్సర్‌ కి కోల్ కతా నైట్ రైడర్స్ చీర్‌గర్ల్స్‌ను తాకడం ఆసక్తి కలిగించింది.

Also Read : Congress: “ఇక అధిష్టానం నిర్ణయమే”.. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం..

ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో సుయాశ్‌ శర్మ వేసిన ఐదో బంతిని శివమ్ దూబే ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు. అక్కడే కేకేఆర్‌ చీర్‌గర్ల్స్‌ కూర్చొని ఉండగా వారి వద్దకే బంతి నేరుగా వెళ్లి పడింది. బంతి వెళ్లి ఒక చీర్‌గర్ల్‌కు తాకింది. దీంతో పాపం బంతి స్పీడుగా వచ్చి తగలడంతో నొప్పితో విలవిల్లాలాడిన చీర్‌గర్ల్‌ బాల్ తగిలిన చోట రాసుకోవడం కనిపించింది. ఆ తర్వాత చీర్‌గర్ల్స్‌ మధ్య నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read : Himanta Biswa Sarma: ఒక్కదానికే కాంగ్రెస్ ఇంత ఓవరాక్షనా..? ఇటువంటివి మేం మస్త్ చూసినం..

ఇక టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. సీఎస్కే ఓపెనర్లు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ కేకేఆర్ బౌలర్లు వారిని ఇబ్బంది పెట్టి.. వరుసగా వికెట్లు తీశారు. సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ( 17 ), డేవాన్ కాన్వే ( 30 ), రవీంద్ర జడేజా పర్వాలేదనిపించినా.. అజింక్యా రహానే ( 16 ), అంబటి రాయుడు ( 4 ), మొయిన్ అలీ ( 1 ) లు మరోసారి విఫలమయ్యారు. శివమ్ దూబే చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు.

Exit mobile version