NTV Telugu Site icon

Ruthuraj Gaikwad: చెన్నై ప్రజలకు ఎంగేజ్మెంట్ ను అంకితం చేసిన సీఎస్కే ఓపెనర్

Ruturaj Gaikwad

Ruturaj Gaikwad

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ప్రజలకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. తన వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని చెన్నై ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ఆయన ప్రకటించాడు. మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ సొంత రాష్ట్రానికే చెందిన మహిళా క్రికెటర్ ఉత్కర్ష పవార్ ను జూన్ 3న మహాబలేశ్వర్ లో పెళ్లి చేసుకోనున్నాడు.

Also Read : Cholesterol Control Tips : కొవ్వును వెన్నలా కరిగించే ఆయుర్వేద మూలికలు..

తాజాగా రుతురాజ్ గైక్వాడ్ రుతు, ఉత్కర్ష పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఉత్కర్ష మొదటి నుంచి నా జీవితంలో.. నా ప్రయాణంలో భాగంగా ఉంది. నా జీవితంలో అన్ని ముఖ్య విషయాల గురించి ఆమెకు తెలుసు.. సంప్రదాయ మహారాష్టియన్ ఎంగేజ్మెంట్ ను చెన్నై ప్రజలకు, దక్షిణాది సంస్కృతికి అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది అందులో రుతురాజ్ గైక్వాడ్ రాసుకొచ్చాడు.. ఈ పట్టణానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ నా జీవితానికి ఎంతో చేసింది.. ఐ లవ్ యూ ఉత్కర్ష అంటూ రుతురాజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నాడు.

Also Read : Fraud in Instagram: ఇన్‌స్టాలో రేటింగ్ పేరుతో భారీ మోసం.. మహిళా టెక్కీ నుంచి కోటిన్నర స్వాహా

ఉత్కర్ష పవార్ దేశవాళీ క్రికెట్ లో మహారాష్ట్ర తరఫున కొన్ని మ్యాచ్ లు ఆడింది. పుణెకు చెందిన ఆమె చాలా ఏళ్లుగా రుతురాజ్ గైక్వాడ్ తో ప్రేమయాణం నడుపుతోంది. రుతురాజ్ గైక్వాడ్ చెన్నై టీమ్ లో కీలక ఆటగాడిగా మారడంతో పాటు తాజాగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో అదరిపోయే బ్యాటింగ్, ఫీల్డింగ్ తో జట్టు విజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించాడు. మహేంద్ర సింగ్ ధోనీ మాదిరే సీఎస్కేలోని ఇతర కీలక ప్లేయర్ల పట్ల చెన్నై ప్రజలు తెగ అభిమానం కురిపిస్తుంటారు. అందుకే గైక్వాడ్ ఈ ప్రకటన చేస్తూ తన అభిమానాన్ని సైతం తమిళనాడు ప్రజలపై చాటుకున్నట్లు కనిపిస్తోంది.

Show comments