NTV Telugu Site icon

CSK Team: మరోసారి అనుభవానికే పెద్దపీట.. ధోనీ సెలెక్షన్ సూపర్! సీఎస్‌కే ఫుల్ టీమ్ ఇదే

Csk Squad Opl 2025

Csk Squad Opl 2025

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరోసారి అనుభవానికే పెద్దపీట వేసింది. ‘డాడీస్ ఆర్మీ’ అనే పేరుకు తగ్గట్టే.. సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. బడా స్టార్ జోలికి పోకుండా, కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా.. మంచి ఆటగాళ్లను తక్కువ ధరకే కైవసం చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సూచనలతో సీఎస్‌కే మేనేజ్మెంట్ వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సీఎస్‌కేలో అనుభవ ఆటగాళ్లతో పాటు భవిష్యత్తు ప్లేయర్స్ కూడా ఉన్నారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు రుతురాజ్ గైక్వాడ్‌, మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. వేలంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు మళ్లీ జట్టులోకి తీసుకుంది. కివీస్ హిట్టర్స్ డేవాన్ కాన్వే (రూ.6.25 కోట్లు), రరచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)లను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది. అలానే సామ్‌ కరన్ రూ.2.40 కోట్లకు దక్కాడు. అయితే అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ కోసం రూ.10 కోట్లు వెచ్చించడం విశేషం. భారత ప్లేయర్స్ ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీ, దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠిలను కైవసం చేసుకుంది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి.. 25 మందితో జట్టును సిద్ధం చేసింది.

వేలంలో చెన్నై కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
1. డెవాన్ కాన్వే – రూ. 6.25 కోట్లు
2. రాహుల్ త్రిపాఠి – రూ. 3.4 కోట్లు
3. రచిన్ రవీంద్ర – రూ. 4 కోట్లు
4. రవిచంద్రన్ అశ్విన్ – రూ. 9.75 కోట్లు
5. ఖలీల్ అహ్మద్ – రూ. 4.80 కోట్లు
6. నూర్ అహ్మద్ – రూ. 10 కోట్లు
7. విజయ్ శంకర్ – రూ. 1.2 కోట్లు
8. సామ్ కరన్ – రూ. 2.4 కోట్లు
9. షేక్ రషీద్ – రూ. 30 లక్షలు
10. అన్షుల్ కాంబోజ్ – రూ. 3.4 కోట్లు
11. ముఖేష్ చౌదరి – రూ. 30 లక్షలు
12. దీపక్ హుడా – రూ. 1.7 కోట్లు
13. గుర్జప్నీత్ సింగ్ – రూ. 2.2 కోట్లు
14. నాథన్ ఎల్లిస్ – రూ. 2 కోట్లు
15. జామీ ఓవర్టన్ – రూ. 1.5 కోట్లు
16. కమలేష్ నాగరకోటి – రూ. 30 లక్షలు
17. రామకృష్ణ ఘోష్ – రూ. 30 లక్షలు
18. శ్రేయాస్ గోపాల్ – రూ. 30 లక్షలు
19. వంశ్ బేడీ – రూ. 55 లక్షలు
20. ఆండ్రీ సిద్దార్థ్ – రూ. 30 లక్షలు

Also Read: SRH Team: ఇషాన్, షమీ, సచిన్‌.. ఈసారి పక్కా కప్! సన్‌రైజర్స్ ఫుల్ టీమ్ ఇదే

రిటైన్ లిస్ట్:
1. రుతురాజ్ గైక్వాడ్‌,
2.మతీష పతీరణ,
3.శివమ్ దూబే,
4.రవీంద్ర జడేజా,
5.ఎంఎస్ ధోనీ