NTV Telugu Site icon

IPL Ticket: “నిలువు దోపిడీ” ఐపీఎల్ టికెట్ రూ.2,343.. ట్యాక్స్ పేరిట రూ.1,657 వసూలు!

Ipl Ticket

Ipl Ticket

ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) శుక్రవారం తలపడ్డాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించిన అభిమాని ఓ కీలక విషయాన్ని బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Kollywood : సూర్యకు పోటీగా శశి కుమార్.. గెలుపెవరిదో..?

అదేంటంటే.. ఓ చెన్నై జట్టు అభిమాని.. తనను చెన్నై జట్టు యాజమాన్యం నిలువు దోపిడీకి గురి చేసిందని ఆరోపించాడు.. తాను రూ. 4000లు పెట్టి టికెట్ కొంతే.. 1,657 రూపాయలను పన్నుల రూపంలోనే చెల్లించాల్సి వచ్చింది. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ. 2,343 ఉంది. వినోద పన్ను (25%) కింద 781 టాక్స్ వేశారు. మళ్లీ మొత్తం పై 28 శాతం జీఎస్టీ విధించారు. ఇందులో కేంద్రానికి 14%.. రాష్ట్రానికి 14% వెళ్తుంది. రూ. 4000 రూపాయలలో మొత్తం 1657 రూపాయలను పన్నుల రూపంలోనే ప్రభుత్వాలు స్వీకరిస్తున్నాయి.

READ MORE: Naga Chaitanya: ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నీ మీ కోసం ఒకే చోట

“క్రికెట్ అంటే నాకు ఇష్టం. అభిమాన ఆటగాళ్లు ఆటను చూడటం చాలా ఇష్టం. అందువల్లే ఎంత ఖర్చైనా పర్వాలేదని టికెట్ కొనుగోలు చేస్తే.. అందులో 1657 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేశారు. అసలు టికెట్ ధర 2,343 రూపాయలు మాత్రమే. ఈ స్థాయిలో పన్నులు వసూలు చేసి.. అభిమానులను సైతం నిలుపు దోపిడికి గురి చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడి అభిమానుల జేబులకు చిల్లులు పెట్టడం ఎంతవరకు సమంజసం.. ఐపీఎల్ అంటే అభిమానుల జేబులకు కత్తెర వేయడమేనా” అంటూ ఆ అభిమాని నిలదీశాడు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కు రెంట్ చెల్లించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం టికెట్ల విక్రయాలను తనే నిర్వహించింది.