Site icon NTV Telugu

CS Shanti Kumari : ఫించన్ల ఖాళీలపై సీఎస్‌ కీలక ఆదేశాలు

Shanti Kumari

Shanti Kumari

రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జీఓ 58, 59 అమలు, గృహలక్ష్మీ, ఆసరా పింఛన్లు, సాంఘీక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక పింఛనుల మంజూరిపై నిత్యం సమీక్షిస్తున్నందున, పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలన్న సీఎస్ సూచించారు. రైతు రుణ మాఫీకై ప్రభుత్వం 19,446 కేటాయించిందని, అతితక్కువ సమయంలో ఈ రుణ మాఫీ ముమ్మరంగా కొనసాగుతోందని సీఎస్ అన్నారు.

Also Read : Manchu Vishnu: కన్నప్ప నుంచి ఆమె అవుట్.. బాధగా ఉందన్న మంచు విష్ణు

రుణ మాఫీ పొందిన రైతులను వెంటనే కొత్తగా పంట రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించిన సీఎస్‌ శాంతి కుమారి.. ఈ అంశంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, అయినప్పటికీ ఈ ఎరువుల పంపిణి సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారని, నిరుపేదలకు లబ్ది చేకూరే జీ.ఓ 58 క్రింద స్వీకరించిన దారఖాస్తులను వారం రోజులలోగా దర్యాప్తు పూర్తి చేసి పట్టాలను అందచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5707 కొత్త గ్రామ పంచాయితీ భవనాలను మంజూరీ చేయడం జరిగిందని, వీటన్నింటి నిర్మాణాలను ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ పామ్ క్రింద నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎస్‌ స్పష్టం చేశారు.

Also Read : Papam Pasivadu: ఆహా ఒరిజినల్ కోసం ర్యాప్‌ సాంగ్.. పాపం పసివాడు టైటిల్‌ సాంగ్ విన్నారా?

Exit mobile version