NTV Telugu Site icon

CS Letter: ఈ-ఫార్ములా రేసింగ్‌పై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ లేఖ

E Formula Race

E Formula Race

CS Letter: ఈ-ఫార్ములా రేస్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాశారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను సీఎస్ జతచేసి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో విచారణకు గవర్నర్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్‌ను కేబినెట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి సీఎస్ లేఖ పంపారు.

Read Also: Deputy CM Bhatti Vikramarka: తప్పు చేశారా లేదా అని చెప్పాల్సింది కేటీఆర్ కాదు..

ఈ క్రమంలో ఏసీబీ ఈ-ఫార్ములా రేస్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపనుంది. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా కారు రేసు నిర్వహణకు సంబంధించిన రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.