Site icon NTV Telugu

CS Shanti Kumari : పన్ను, పన్నుయేతర ఆదాయాలపై సీఎస్ సమావేశం

Cs Shanti Kumari

Cs Shanti Kumari

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం అధికారులతో సమావేశమై రాష్ట్ర సొంత పన్ను, పన్నేతర ఆదాయాల సాధనలో సాధించిన ప్రగతిని సమీక్షించారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, మైనింగ్ తదితర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారానికోసారి సమీక్షలు నిర్వహించి లక్ష్యాలను చేరుకునేలా చూడాలని ఆమె కోరారు. కమర్షియల్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలు అదనపు ఆదాయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించాలని కోరారు.

Also Read : Kodali Nani Drives RTC Bus: ఆర్టీసీ బస్సును నడిపిన కొడాలి నాని.. వైరల్‌గా మారిన వీడియో

తెలంగాణ ప్రభుత్వం రూ. 91,145 కోట్ల పన్ను రాబడి వసూళ్లు మరియు రూ. 6,996 కోట్ల పన్నుయేతర రాబడుల ద్వారా 2023 జనవరి చివరి నాటికి మొత్తం రూ. 98,141 కోట్లకు చేరుకుంది. ఈ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల కమిషనర్ రాహుల్ బొజ్జా, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : Gold and Silver Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌.. మరింత పడిపోయిన బంగారం ధర

Exit mobile version