Site icon NTV Telugu

CS Shanti Kumari : వ్యవసాయ శాఖపై సీఎస్‌ సమీక్ష

Cs Shanti Kumari

Cs Shanti Kumari

వ్యవసాయ శాఖపై సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యవసాయ అనుకూల విధానాల వల్ల కోటి ఎకరాల మాగాణి లక్ష్యం నెరవేరిందని సీఎస్‌ అన్నారు. సాగునీటి సౌకర్యం, రైతు బంధు, యాంత్రీకరణ, రైతుభీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు తదితర విప్లవాత్మక పధకాలవల్ల రాష్ట్రంలో వానాకాలం, యాసంగిలతో కలిపి మొత్తం కోటి ఇరవై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వివరించారు. వరి అనంతరం, 56.37 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అన్నారు. వీటిలో, వరి ఉత్పత్తిలో తెలంగాణా దేశంలోనే రెండవ స్థానంలో ఉండగా, పత్తి ఉత్పత్తిలో మూడవస్థానంలో నిలిచిందని అన్నారు.

Also Read : Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు

రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది రైతు లబ్దిదారులకు ఇప్పటి వరకు రూ. 65,191 కోట్లను రైతు బంధు కింద పంపిణి చేశామని సి.ఎస్ వెల్లడించారు. రైతు భీమా క్రింద వివిధ కారణాల వల్ల మరణించిన 97,913 మంది రైతు కుటుంబాలకు రూ.4,896 కోట్లు భీమా మొత్తాన్ని అందచేశామని చెప్పారు. రానున్న వానాకాలానికి గాను సరిపడా ఎరువులు, విత్తనాలను ముందస్తుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల మార్కెటింగ్ పై కఠినంగా వ్యవహరిస్తున్నామని, దీనిలో భాగంగా ఇప్పటి వరకు 551 మందిని అరెస్ట్ చేసి 347 కేసులను నమోదు చేశామని వివరించారు. వీటిలో, 16 మందిపై పీడీ చట్టం కేసులు పెట్టి, 11,872 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Also Read : Farooq Abdullah: ముందుగా ఎన్నికల్లో గెలుద్దాం.. ప్రధాని పదవిపై ఫరూఖ్ అబ్దుల్లా..

రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేయడంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే విధంగా విజయ నూనె ఉత్పత్తులకు విస్తృత ప్రచారం గావించడం, పండ్లను సేంద్రియ పద్దతిలో మాగపెట్టడం, వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు క్యాంపస్ నియామకాలను కల్పించడం లాంటి వినూత్న విధానాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేసారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సాంకేతికతను అందచేయడం, అగ్రి స్టార్టాప్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు తదితర వినూత్న అంశాలపై డిజిటల్ సర్వీసులను అందించడానికి చీఫ్ సెక్రటరీ చైర్ పర్సన్ గా ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read : Iran: బాలికల పాఠశాలలపై గ్యాస్ దాడులు.. 100 మందికి పైగా ఆస్పత్రికి తరలింపు

ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కార్యదర్శి, రెవిన్యూ శాఖ కార్యదర్శి, ఐటి శాఖ కార్యదర్శి ఉంటారని తెలియచేసారు. ఉద్యానవనం రంగంలో మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా కూరగాయల పెంపకంపై రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో వివిధ కంపెనీల నూనె ఉత్పత్తుల కంపెనీలతో పాటు కల్తీ నూనెలు చెలామణిలో ఉన్నాయని, వీటిని నిరోధించడానికి కల్తీ రహిత విజయ నూనె ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేపట్టాలని శాంతి కుమారి ఆదేశించారు.

Exit mobile version