NTV Telugu Site icon

CS Shanti Kumari : కొత్త సచివాలయంలో భద్రతపై సీఎల్‌ శాంతి కుమారి సమీక్ష

Shanti Kumari

Shanti Kumari

కొత్త సచివాలయంలో భద్రతపై సీఎస్‌ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫిబ్రవరి 17 వ తేదీన ప్రారంభించనున్న డా. బీఆర్‌ అంబేద్కర్ సచివాలయానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ, రోడ్లుభవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటి తదితరశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేయాలని, సిటీ ట్రాఫిక్ విభాగం నుండి 22 ట్రాఫిక్ అధికారుల కేటాయించాలన్నారు. అంతేకాకుండా.. ‘భద్రతా పరమైన పరికరాలైన బ్యాగేజ్ స్కానర్లు, వెహికిల్ స్కానర్లు, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలని నిర్ణయం. మొత్తం 28 ఎకరాల లో మొత్తం 9.42 చ.ఆ. విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900 లకు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు సదుపాయం. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టుల ఏర్పాటు. 300 సీసీ టీవీ లద్వారా భద్రతా పర్యవేక్షణ. సీసీ టివి లతో పాటు ఇతర భద్రతా పరమైన చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఆధునాతన కార్పొరేట్ కార్యాలయాల మాదిరిగా సచివాలయంలోకి వచ్చి వెళ్లే సందర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులతో కూడిన మానిటరింగ్.

Also Read : Minister Malla Reddy : బీజేపీ జూటా పార్టీ.. జూటా నేతలు..

34 సిబ్బంది తో రెండు ఫైర్ ఇంజన్ల ఏర్పాటు. సచివాలయ భవనం లో ఫైర్ సెఫిటీ ఏర్పాట్లు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు. 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతి. ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరా ఏర్పాటు. సీవరేజ్ పనులు. ఫార్ములా ఈ-రేసింగ్ పై సి.ఎస్ శాంతి కుమారి ఉన్నతస్థాయి సమావేశం. ఫిబ్రవరి 11 న జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ తెలుగుతల్లి ఫ్లయ్ ఓవర్ నుండి ఖైరతాబాద్ ఫ్లయ్ ఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుండి ఐ-మాక్స్ వరకు రోడ్ లను ఫిబ్రవరి 5 వతేదీ నుండి ట్రాఫిక్ మూసివేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలి. ఫార్ములా ఈ-రేస్ సందర్బంగా సచివాలయ పనులకు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు చేయాలి’ అని నిర్ణయం తీసుకున్నారు.

Show comments