Site icon NTV Telugu

Kanti Velugu : కంటి వెలుగు నిర్వహణపై సీఎస్‌ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్

Shanti Kumari

Shanti Kumari

కంటి వెలుగు నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ఈనెల 18 వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 2018 లో నిర్వహించిన తొలివిడత కంటి వెలుగు కన్నా ఎక్కువ మందికి కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా మన రికార్డు మనమే బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని అన్నారు.

Also Read : Off The Record: లోకల్‌-నాన్‌లోకల్‌ రగడ.. మల్కాజ్‌గిరి బీజేపీలో కుంపట్లు..!

ఇప్పటికే 15 లక్షలకు పైగా కళ్లజోడ్లను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలకు, అర్బన్ వైద్య కేంద్రాలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. కంటి వెలుగు పై ప్రతి ఇంటికి , ప్రతీ ఒక్కరికీ తెలిసేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని, అత్యంత ఉన్నత ప్రమాణాలతోకూడిన సేవలను అందించాలని సీఎస్‌ ఆదేశించారు.

Also Read : CM KCR : భూపాలపల్లిలో ముగ్గుల పోటీ.. ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్‌ చిత్రం

Exit mobile version