NTV Telugu Site icon

Dorset Beach: వీళ్లు చాలా లక్కీ భయ్యా… నిమిషంలో తప్పించుకున్నారు!

Beach 1

Beach 1

ఎక్కడికైనా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా బీచ్ లు, కొండచరియాలు ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంజాయ్ చేయడమే కాకుండా చుట్టుపక్కలు కూడా గమనిస్తూ ఉండాలి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎంతో మంది ఇలాంటి ప్రదేశాలలో ప్రాణాలు కోల్పొయారు. ఇటీవల కాలంలో ఫ్యామిలితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ మహిళ అలల దాటికి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అయ్యింది. ఇది మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొండచరియలు పెద్ద ఎత్తున విరిగి పడడం, వరదలతో భారీ ఇళ్లు కూడా నేలమట్టం కావడం తెలిసిందే.

Also Read: Virat Kohli: ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు… క్లారిటీ ఇచ్చిన కోహ్లీ!

ఇలాంటి షాకింగ్ ఘటనే బ్రిటన్ లోని ఓ బీచ్ ఒడ్డున జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో కనిసిస్తున్న దాని ప్రకారం బ్రిటన్ లోని డోర్సెట్ వెస్ట్ అనే తీర ప్రాంత పర్యాటక ప్రదేశంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు పర్యాటకలు బీచ్ తీరంలో నడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఎత్తయిన కొండ నుంచి కొండ చరియలు ఒక్కసారిగా విరిగి పడ్డాయి. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాన్ని గమనించిన మగ్గురు పర్యాటకులు వేగంగా పరిగెత్తారు.

లక్కీగా వారు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అందుకే కొండలు, బీచ్ లు, అటవీ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ వీడియోను డోర్సెట్ కౌన్సిల్ యూకే తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ బండరాళ్లు, కొండచరియాలు ఎప్పుడైనా విరిపడొచ్చు. వీరు లక్కీగా తప్పించుకున్నారు. సౌత్ వెస్ట్ కోస్ట్ మార్గాన్ని మూసివేశారు అంటూ రాసుకొచ్చారు.