CRPF: సీఆర్పీఎఫ్ ఆపరేషన్ విజయవంతం.. కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ ఏర్పాటు..!
- కర్రెగుట్టలపై భద్రతా బలగాల పట్టు
- 9 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో విజయం సాధించిన CRPF
- నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్న ఐబీ చీఫ్
- 9 రోజుల పాటు సాగిన ఆపరేషన్‌ను IB చీఫ్‌కు వివరించిన CRPF
- డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆపరేషన్స్ చేసిన CRPF .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRPF: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించిన కర్రెగుట్టలపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. గత 9 రోజులుగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఘనవిజయం సాధించింది. మావోయిస్టుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో అడవుల్లో కష్టమైన ప్రదేశాలను గుర్తించి సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు జరిపాయి. ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) చీఫ్ స్వయంగా కర్రెగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన ఆపరేషన్ వివరాలను CRPF అధికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే మావోయిస్టుల డంపులు, సొరంగాలను గుర్తించిన భద్రతా బలగాలు, వాటిని నిర్వీర్యం చేయడంలో విజయవంతమయ్యాయి.
Read Also: Cabinet decisions: జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’..కేంద్రం సంచలన నిర్ణయం..
Also Read
ఈ నేపథ్యంలో కర్రెగుట్టలపై CRPF బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో కూడా మావోయిస్టుల కదలికలపై గట్టి పట్టు సాధించేందుకు ఇది కీలకదైన అడుగుగా భావిస్తున్నారు అధికారులు. 9 రోజుల పాటు సాగిన ఆపరేషన్‌లో పాల్గొన్న తొలి టీమ్‌ను అధికారులు వెనక్కి పంపించి, కొత్త బృందాన్ని రంగంలోకి దింపారు. దీనితో భద్రతా చర్యలు మరింత బలపడనున్నాయి. సమగ్ర రక్షణ కోసం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!