Site icon NTV Telugu

Crow Attack on MP: పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీపై కాకి దాడి.. వైరల్‌గా మారిన ఫొటోలపై బీజేపీ సెటైర్లు

Raghav Chadha

Raghav Chadha

Crow Attack on MP: పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఎంపీపై కాకులు దాడి చేశాయి.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కాకుల దాడి నుండి తప్పించుకుంటున్నట్లు ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు బుధవారం రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. పార్లమెంట్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో, పార్లమెంటు ఆవరణలో ఒక కాకి అతడిపై దాడికి యత్నించింది.. కాకి బారి నుంచి ఎంపీ తప్పించుకుంటున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాకుల దాడి నుండి రాఘవ్ చద్దా తప్పించుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే, రాఘవ్ చద్దాపై కాకి దాడి ఘటన తర్వాత, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ చిత్రాన్ని అందరితో పంచుకుంది. కాకి కరిచింది అంటూ ఢిల్లీ బీజేపీ హేళనగా రాసుకొచ్చింది.. ఈ రోజు వరకు నేను విన్నాను, ఈ రోజు కూడా నేను అబద్ధాల కోరును.. కాకి కరిచినట్లు చూశాను! అంటూ కామెంట్‌ పెట్టింది. మరోవైపు నెటిజన్లు కూడా ఈ ఘటనపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని ఓ ట్విట్టర్ యూజర్ రాశారు. పార్లమెంట్ ఆవరణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను కాకి గుచ్చేసింది అని పేర్కొంటే.. అన్షుమాన్ అనే వినియోగదారు తాంజియా యాసలో రాస్తూ.. కాకులు కూడా అతన్ని విడిచిపెట్టడం లేదని రాశాడు.. ఇక, ఈ ఘటనపై సానుభూతి వ్యక్తం చేస్తూ మరో ట్విట్టర్ యూజర్ విక్రమ్ తివారీ.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాకి కొట్టిందని రాశారు. గుండె చాలా కలత చెందిందని వ్యాఖ్యానించారు.

ఇక, మణిపూర్ హింసాకాండపై మాట్లాడిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను వర్షాకాల సమావేశానికి సస్పెండ్ చేయడంపై రాఘవ్ చద్దా మాట్లాడుతూ, మణిపూర్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మరియు 356 ఉల్లంఘించబడడమే కాకుండా, అక్కడ మానవత్వం కూడా సిగ్గుపడేలా ఉందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శాంతిభద్రతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే మణిపూర్‌లోని బీరెన్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version