NTV Telugu Site icon

Crossandra Flowers Cultivation : కనకాంబరం సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Kanakambaram

Kanakambaram

మల్లేపూల తర్వాత అంత డిమాండ్ కనకాంబరం పూలకే ఉంది.. వీటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే కొత కోసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మాత్రం మంచి లాభాలను పొందవచ్చు.. కనకాంబరం కోసే ముందు, మార్కెట్ చేస్తున్న సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం..

మన తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు.మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు. కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతోపాటు పూల సాగుచేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండడం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ పూలు అనేక రంగుల లో ఉంటాయి..ఎక్కువ మంది రైతులు ఎరుపు, నారింజ రంగు పూలను పండిస్తారు. అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలం.. చలి కాలంలో ఎక్కువగా దిగుబడిని పొందవచ్చు..

పంట వేసిన మూడు నెలల తర్వాత మొక్కలకు పూలు పూస్తాయి.. పుష్పం పూర్తిగా తెరవడానికి దాదాపు 2 రోజులు పడుతుంది. కాబట్టి పూలను ప్రత్యామ్నాయ రోజులలో తెల్లవారుజామున కోయడం జరుగుతుంది. స్పైక్ యొక్క పొడవుపై ఆధారపడి, ఒక స్పైక్‌లో పుష్పించడం పూర్తి చేయడానికి దాదాపు 15-25 రోజులు పడుతుంది.. మార్కెట్ కు తరలించ్చేటప్పుడు గుడ్డ లో లేదా ఫాలిథిన్ కవర్లలో ఫ్యాక్ చేస్తారు.. ఇలా చేస్తే పూలు ఫ్రెష్ గా ఉంటాయి. మార్కెట్ లో రేటుగా భారీగా ఉంటుంది.. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. లక్షలు సంపాదించవచ్చు..