NTV Telugu Site icon

Telangana Storms: ఈదురు గాలులకు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ చిన్నారి..

Siddipet , Medak

Siddipet , Medak

Telangana Storms: రాష్ట్రంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. మెదక్ జిల్లాలో ఊయలలో ఆడుతున్న చిన్నారి ఈదురు గాలులకు ఎగిరి పక్కనే ఉన్న డాబాపై పడి మృతి చెందగా, సిద్దిపేట జిల్లాలో చెట్టు కూలడంతో టెన్త్ విద్యార్థి మృతి చెందాడు. వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాకు చెందిన మాలోత్ మాన్‌సింగ్, మంజుల దంపతులకు సీత, గీత అనే కవలలు ఉన్నారు. దంపతులు కూలి పనులకు వెళ్లగా పిల్లలు, అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. మంగళవారం ఈదురు గాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు ఒక్కసారిగా లేచిపోయింది. ఇంట్లో చీరకట్టులో ఆడుకుంటున్న సీత (5) కూడా రేకులతోపాటు ఎగిరి 20 మీటర్ల దూరంలో ఉన్న మరో డాబా ఇంటిపై పడింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నర్సాపూర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది.

Read also: SSC Recruitment 2024 : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

మరోవైపు పదో తరగతి పరీక్షకు హాజరైన ఎం వెంకటేష్ (16) మృతి చెందాడు. జిల్లావ్యాప్తంగా సాయంత్రం వరకు వర్షం కురువడంతో వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి, కూరగాయలు తదితర పంటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల కారణంగా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ నేలకూలాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు తన నియోజకవర్గం నుంచి రైతులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరాకు రూ.10వేలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు, వడగళ్ల వానలు కురిశాయి. వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు వెంటనే అంచనా వేయలేకపోతున్నారు.
Congress : కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఏఐ