NTV Telugu Site icon

Crispy Prawns Fry : రొయ్యలను ఇలా చేస్తే చాలు.. టేస్ట్ అదిరిపోతుంది..

Prawns Fry

Prawns Fry

రొయ్యలు చాలా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. అందుకే ఎక్కువగ రొయ్యలను తినడానికి ఇష్టపడుతుంటారు.. అయితే రొయ్యలలో కూడా రకరకాల వంటలను తయారు చేసుకోవచ్చు.. ఈరోజు మనం కరకరలాడే రొయ్యల వేపుడును ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..రొయ్యలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తినవచ్చు లేదా పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ క్రిస్పీ రొయ్యల ఫ్రైను తయారు చేయడం చాలా సులభం. కరకరలాడుతూ ఉండే రొయ్యల ఫ్రైను అందరికి నచ్చేలా చాలా సింపుల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

రొయ్యలు – 400 గ్రా,

ధనియాల పొడి – ఒక టీ స్పూన్,

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్,

కారం – ఒకటిన్నర టీ స్పూన్,

ఉప్పు- తగినంత,

పసుపు – పావు టీ స్పూన్,

నిమ్మరసం – అర చెక్క,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా,

నూనె – డీప్ ఫ్రైకు సరిపడా,

కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్,

బ్రెడ్ క్రంబ్స్ – 4 టీ స్పూన్స్..

తయారీ విధానం :

ముందుగా రొయ్యలను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. తరువాత ఇందులో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లోర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను ఒక్కో దానిని తీసుకుంటూ కార్న్ ప్లోర్ మిశ్రమంలో వేసుకోవాలి.. రొయ్యలకు బాగా పట్టేలా కోటింగ్ చేసుకోవాలి.. అప్పుడే ముక్క టేస్ట్ గా ఉంటుంది.. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఇక నూనె వేడయ్యాక ఒక్కో రొయ్యను నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత అటూ ఇటూ కదుపుతూ వేయించుకోవాలి. మధ్యస్థ మంటపై రెండు వైపులా క్రిస్పీగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.. అంతే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు ఫ్రై రెడీ అయ్యినట్లే.. ఒక్కటి కూడా విడిచి పెట్టకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.. మీకు నచ్చితే మీరు ట్రై చెయ్యండి..