Raidurgam Police: హైదరాబాద్ పలుచోట్ల బైక్ రేసింగ్స్తో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. భయంకరమైన శబ్ధాలతో టీ హబ్, ఐటీసీ కొహినూర్, నాలెడ్జ్ పార్క్, సాత్వా బిల్డింగ్ ప్రాంతాలో బైక్ రేసింగ్స్తో యువకులు హచ్చల్ చేస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. రేసింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైకులను స్వాధీనం చేసుకొని.. ఆర్టీఏ అధికారులకు అప్పగించారు. రేసింగ్తో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పైన బైక్ రేసింగ్ తో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదు అని ఇప్పటివరకు వార్నింగ్ మాతరమే ఇచ్చాము అని ఇక ముందు ఇలాంటివి జరిగితేయ్ క్రిమినల్ కేసులతో జైల్లో పెడతామని సైబరాబాద్ పోలీసులు గట్టిగ వార్నింగ్ ఇచ్చారు.
Hyderabad Police: ఇకపై బైక్ రేసింగ్లకు పాల్పడితే క్రిమినల్ కేసులు.. ఏసీపీ శ్రీకాంత్
- హైదరాబాద్ పలుచోట్ల బైక్ రేసింగ్స్
- సింగ్స్కి పాల్పడిన 50మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు