Site icon NTV Telugu

Crime News: పాయల్ ఆత్మహత్య.. గొంతుకోసి, ముఖంపై యాసిడ్ పోసి

Payal

Payal

Crime News: కొన్ని క్రైమ్ వార్తలు వింటుంటే దేవుడా ఇలాంటి వాళ్ళు ఉంటారా..? అనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని క్రైమ్ వార్తలు చదివితే ఛీఛీ ఇలాంటి సమాజంలో ఉన్నామా అనిపిస్తోంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి మనిషి ఎంతకైనా దిగజారతాడు అనేది ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అర్ధమవుతోంది. ఒక అమ్మాయి.. తన ఉనికిని కాపాడుకోవడానికి పోలీసులు పిచ్చోళ్లను చేసింది. ఒక అమాయకమైన యువతీ గొంతు కోసింది. ఎంతోమంది కడుపుకోతను కారణమైంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రేటర్ నోయిడాకు దగ్గర్లోని ఒక గ్రామంలో పాయల్ నివసిస్తోంది. చిన్నప్పటి నుంచి తండ్రి వ్యాపారస్తుడు. ఆమె పెరిగేసరికి వ్యాపారాల్లో నష్టం వచ్చి అప్పుల బాధలో కూరుకుపోయి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చనిపోవడంతో పాయల్ డిప్రెషన్ లో కూరుకుపోయింది. ఆ సమయంలో ఆమెకు అజయ్ పరిచయమయ్యాడు. అతని ప్రేమలో కోలుకొంటుంది అనేలోపు ఆమె ఆత్మహత్య చేసుకొంది. ఒంటికి నిప్పంటించుకొని మృతిచెందింది. ఇంకేముంది కాలిపోయిన మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేయడంతో పోలీసులు సూసైడ్ కేసుగా రాసి కేసు క్లోజ్ చేశారు. ఇక ప్రియురాలే లేనప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి అని అజయ్ కూడా దేశాలు తిరగడం మొదలుపెట్టాడు. అరెరే ఎంత అన్యాయం జరిగింది పాయల్ కు అని అనుకోకండి. ఇదే కథలో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే.. పాయల్ చనిపోలేదు. తండ్రి అప్పులు తీర్చలేక చనిపోయినట్లు ప్లాన్ గీసి పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ చేసింది. హహ షాక్ అయ్యారా.. ఈ కథ ఎక్కడో విన్నట్టు ఉంది కదా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో లేడీ విలన్ సేమ్ ఇలాగే తన ఉనికిని కాపాడుకోవడానికి పోలీసులను పిచ్చివాళ్లను చేస్తోంది. ఇక్కడ పాయల్ కూడా అదే చేసింది. అందుకు ప్రియుడు అజయ్ ను వాడుకొంది.

ఇక ఈ ఘటన వెనుక మాస్టర్ ప్లాన్ ఎలా జరిగిందంటే.. పాయల్ పోలికలతో ఉన్న ఒక యువతిని వెతికి ఆమెతో అజయ్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా కొద్దిగా చనువు అయ్యేవరకు వెయిట్ చేసి ఆమెను రూమ్ కు తీసుకెళ్లి ముందు గొంతుకోసి చంపేశాడు. అనంతరం ఆమె ముఖం పై వేడి నూనె, యాసిడి పోసి ముఖం గుర్తుపట్టకుండా చేసి పాయల్ ఇంట్లో ఎవరు లేని సమయంలో మంటలు అంటించి వచ్చేశారు. పోలీసులు సైతం ఆత్మహత్య అని అనుకొనేలా అన్ని ప్లాన్ చేసి పాయల్ పరారు అయ్యింది. అజయ్ కూడా ముందే వెళితే అనుమానము వస్తుందని అతడిని అక్కడే ఉంచి కథను నడిపించింది. ఇక మొత్తం అనుకున్నది సాధించాక ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరి బండారం ఎలా బయటపడింది అంటే.. అదే గ్రామానికి చెందిన ఒక యువతి మిస్ అయ్యింది. ఎన్ని రోజులు, ఎంత వెతికినా ఆమె దొరకలేదు. ఈ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు ఆమె పనిచేసే స్థలానికి వెళ్లి పరిశీలించగా అజయ్ తో ఆమె కనిపించిందని చెప్పారు. ఇక అజయ్ ను పట్టుకొని ఉతికితే తన ప్రియురాలి కోసమే చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక పాయల్.. ఇదంతా ఒక టీవీ షో చూసి చేసానని చెప్పడం విశేషం. ప్రస్తుతం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Exit mobile version