Crime News: హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు.
Hi-Fi ఆడియో, AI కాల్ నాయిస్ రిడక్షన్, మల్టీ-డివైస్ సపోర్ట్‌తో Vivo TWS 5 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
అందించిన సమాచారం మేరకు గత కొంతకాలంగా భర్తతో వచ్చిన కుటుంబ విభేదాలు, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, ఆవేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
10,000mAh బ్యాటరీ, 12.1 అంగుళాల డిస్‌ప్లేతో Vivo Pad 5e లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
