Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ సంచలనం, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశారు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ క్రికెటర్, రాజకీయ వేదికపై కనిపించడంతో అక్కడివారంతా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. తిలక్ వర్మ అత్యంత ఆప్తమిత్రుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర కొత్త ఎమ్మెల్సీగా (MLC) ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తిలక్ వర్మ ప్రత్యేకంగా హాజరై, తన స్నేహితుడిని కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మైదానంలో విధ్వంసం.. మరుసటి రోజే అసెంబ్లీలో ప్రత్యక్షం..
ఈ పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే తిలక్ వర్మ క్రికెట్ మైదానంలో వీరోచిత ఇన్నింగ్స్తో వార్తల్లో నిలిచారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తెలంగాణ టీ20 (TG20) లీగ్లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్గా లీడ్ చేస్తూ వరంగల్ వారియర్స్ విధించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒంటిచేత్తో కరిగించారు. కేవలం 56 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సర్లతో 136 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఆదివారం ఇండియా-ఎ జట్టును టైటిల్ విజేతగా నిలిపి, సోమవారం లోకల్ లీగ్లో సెంచరీ బాదిన తిలక్, మంగళవారం నాటికి తన బిజీ షెడ్యూల్ నుంచి సమయాన్ని కేటాయించి ముంబై చేరుకోవడం విశేషం. త్వరలోనే భారత జట్టుతో కలిసి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లనున్న తిలక్, వెళ్లేముందు తన స్నేహితుడి జీవితంలోని అతిపెద్ద విజయ గమనంలో భాగస్వామి కావడం వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటిచెబుతోంది.
- Tags
- cricket news
- Tilak Varma
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..